ప్రతిధ్వని: 75 ఏళ్ల సందర్భానికి..75 వారాల ఉత్సవాలు - 12 మార్చి 2021 ప్రతిధ్వని వార్తలు
వజ్రోత్సవ వేళ భారతదేశ దాస్య శృంఖలాలు తెంచిన స్వాతంత్య్రోద్యమ చరిత్రను స్మరించుకునే మహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసింది కేంద్ర ప్రభుత్వం. 75 ఏళ్ల సందర్భానికి తగినట్లు.. 75 వారాల పాటు మహనీయుల చరిత్రను నలుచెరగులా చాటిచెప్పే మహా సంకల్పానికి శ్రీకారం చుట్టింది. సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా.. రానున్న రోజుల్లో దేశమంతటా జాతీయ స్ఫూర్తి రగిలించాలనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో మన స్వాతంత్య్రోద్యమ ఘనత చాటే అమృత్ ఉత్సవ్ లక్ష్యం, భవిష్యత్ ప్రణాళికపై ఈరోజు ప్రతిధ్వని.