yadadri: యాదాద్రి శిల్పకళా వైభవం.. చూసి తరించండి - తెలంగాణ పర్యాటక శాఖ వీడియో
అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా కృష్ణశిలతో ఆగమశాస్త్రం ప్రకారం అణువణువులో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పంచనారసింహ క్షేత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించి ఆలయ ఉద్ఘాటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలతో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక వీడియోను రూపొందించింది.