తెలంగాణ నయాగరా పరవళ్లు చూశారా..! - telangana nayagara bogatha waterfalls
తెలంగాణ ‘నయాగార'గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉరకలెత్తుతోంది. జలపాతం ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్గడ్ అడవుల్లో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది.