తెలంగాణ

telangana

ETV Bharat / videos

VIRAL VIDEO: ఆత్మహత్యకు ముందు ఆ దంపతులు ఏం చెప్పారు..?

By

Published : Aug 17, 2021, 7:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో దంపతుల ఆత్మహత్య కరోనా వల్ల ప్రైవేట్‌ స్కూళ్ల యజమానులు, ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను కళ్లకుగడుతోంది. కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్‌ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, అతని భార్య రోహిణి ఈ నెల 15న ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఉపాధ్యాయ దంపతుల 'సెల్ఫీ సూసైడ్ వీడియో' తాజాగా వైరల్​గా మారింది. 'క్షమించండి చచ్చిపోతున్నాం.. మాలాగా ఎవరూ ఇబ్బందులు పడొద్దంటూ' సెల్ఫీ వీడియో తీసి వారు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details