sriramsagar project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువకు గోదావరి పరవళ్లు - శ్రీరాంసాగర్ నుంచి నీరు విడుదల
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టులో 85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1,090 అడుగుల వద్ద ఉంది. ఎగువ నుంచి 2,15,667 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పెరుగుతూ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.