Rythu bandhu celebrations : రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ పట్ల అన్నదాతల ప్రత్యేక అభిమానం - medchal district news
Rythu bandhu celebrations : రాష్ట్రంలో రైతుబంధు పథకం పెట్టుబడి సాయం కింద రూ.50 వేల కోట్ల మార్క్‌కు చేరడంతో రైతుబంధు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా శంభీపూర్ గ్రామ రైతులు... సీఎం కేసీఆర్‌పై తమదైన రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో... పొలంలో పచ్చగడ్డితో సీఎం చిత్రాన్ని తయారు చేశారు. సుమారు 20 మంది రైతులు రెండు రోజులు శ్రమించి... పచ్చగడ్డితో 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో ఆ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు.