మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన - రిపోర్టర్ జ్యోతికిరణ్ కరోనాపై పాట
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్డౌన్తో నిరుపేదలకు ఉపాధి లేక, యువత ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నానాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నీ ఇంటిని, దేశాన్ని కాపాడుకోవాలంటూ చైతన్యపరిచేందుకు... కవులు, కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.