కేసీఆర్ చిత్రాన్ని ముగ్గు వేశారు.. అభిమానాన్ని చాటుకున్నారు.. - kcr rangoli
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైతుబంధు పండుగ సంబరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని.. ముగ్గులు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రాన్ని వేసి.. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అని రాశారు. ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంది.