Ranganayaka sagar : రంగనాయకసాగర్ ఏరియల్ వ్యూ ఎప్పుడైనా చూశారా? - Ranganayaka sagar reservoir
సిద్దిపేటకు సమీపంలోని రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూ చూపరులను ఆకట్టుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక్ సాగర్ జలకళను సంతరించుకుని పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. రంగనాయక సాగర్ చుట్టూ నీరు నీటి మధ్యలో కొండ... దానిపై ఇరిగేషన్ కార్యాలయం, అతిథి గృహం ఉన్న దృశ్యం కనువిందు చేస్తోంది. మూడు టీఎంసీల సామర్థ్యం గల రంగనాయకసాగర్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా పదివేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయానికి రంగనాయక సాగర్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యాలను మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.