ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న రాళ్లవాగు అందాలు - రాళ్లవాగు వద్ద పర్యాటకుల సందడి
చుట్టూ ఎత్తైన కొండలు. దట్టమైన అడవి. మధ్యలో ఎత్తైన ఆనకట్ట. పైనుంచి జారువారే నీటి ప్రవాహం మనసును ఆ కొండలోయల్లో ఊయల ఊపుతోంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో కొనాపూర్ సమీపాన దట్టమైన అడవిలో నిజామాబాద్ - జగిత్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న రాళ్లవాగు అందాలు కట్టిపడేస్తున్నాయి. చిన్నారులు, యువత స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. గత మూడేళ్ల నుంచి రాళ్లవాగుకు సందర్శకుల తాకిడి పెరిగింది. అయితే ఇక్కడికి వెళ్లేందుకు సరైన మార్గం లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.