Snake Viral Video: వాకింగ్ ట్రాక్‌లోకి కొండచిలువ.. వాళ్లేం చేశారో తెలుసా? - తెలంగాణ వార్తలు
ఆ వాకింగ్ ట్రాక్ ప్రతిరోజూ ఉదయం కళకళలాడుతుంది. రోజులాగే శనివారమూ బుల్కాపూర్ నాలా వాకింగ్ ట్రాక్.. ఉదయాన్నే నిండిపోయింది. అనుకోకుండా ఓ శబ్దం.. ఏదో పాకుతున్నట్లు.. ఏదో బుసలు కొడుతున్నట్లు... ఏంటా అని చూస్తే.. పే..ద్ద.. కొండచిలువ. అందరూ ఉరుకులు పరుగులు తీశారు. కొందరు వెంటనే అలెర్ట్ అయి స్నేక్ సొసైటీకీ కాల్ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చి కొండచిలువను బంధించి అడవిలో వదిలేశారు. రాజేంద్రనగర్ మణికొండ పంచవటి కాలనీలో కనిపించిన 14 అడుగుల కొండచిలువను వాకర్స్ ఎంతో ఆసక్తిగా చూశారు.
Last Updated : Oct 9, 2021, 3:51 PM IST