ప్రతిధ్వని: కొంగుబంగారం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎందుకు? - pratidwani
32 మంది అమరవీరుల త్యాగాలకు ప్రతిరూపం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం 2లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి.. ఒక్కటంటే ఒక్కటి సొంత గని లేకపోయినా.. వరసగా 13ఏళ్ల పాటు లాభాలు చూపించి సాగరతీరానికి మణిహారంలా మారిన సంస్థ. 22వేల ఎకరాల విస్తీర్ణంలో 38వేల మంది కార్మికులకు నేరుగా కడుపు నింపుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణం ఎవరు? ఐదారేళ్లుగా సంస్థ చూపిస్తున్న నష్టాల వెనుక ప్రధాన కారణాలేంటి? ఆంధ్రుల హక్కుగా- తెలుగోడి ఆత్మగౌరవంగా సాధించుకున్న సంస్థ కునారిల్లిపోతుంటే... సలహాదార్లు, కన్సల్టెంట్లను నియమించుకుంటూ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేస్తున్న అడుగులు దేనికి సంకేతం ? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.