PRATIDWANI: టీ-20 ప్రపంచకప్ సమరానికి సిద్ధమవుతోన్న టీమిండియా - cricket news
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌ల కోలాహలం కూడా మొదలైపోయింది. ఈ క్రికెట్ పండుగలో తుది వరకు నిలిచేది ఎవరు? కప్పు ఎగరేసుకుని పోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపంతా ఇటే. టీ ట్వంటీ కెప్టెన్‌గా ఇదే చివరి టోర్నీ అన్న కింగ్ కొహ్లీ... మెగా టోర్నీలు గెలవలేడన్న విమర్శలను బ్రేక్ చేస్తాడా? సుదీర్ఘవిరామం తర్వాత తలపడుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాక్ మ్యాచ్‌పై విశ్లేషకులు ఏమంటున్నారు?. యూఏఈలో ఐపీఎల్ హంగామాకు కొనసాగింపుగా వస్తున్న టీ-20 వరల్డ్‌కప్ ఎలాంటి మజాను అందించనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.