Pratidwani: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో నేరం ఎవరిది? - ప్రతిధ్వని
Pratidwani: కష్టాల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన రాజకీయ నేతలు కొందరు నీతిమాలిన చేష్టలతో దిగజారుతున్నారు. ఆపదలో ఆదుకుంటారని ఆశ్రయిస్తే... మేకవన్నె పులులై ప్రాణాలు తోడేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాల్లో వెకిలి చేష్టలు, వేధింపుల ఘోరాలతో మహిళల మానాభిమానాలకు రక్షణ లేకుండా పోతోంది. ఫలితంగా పరువు, మర్యాదల కోసం కొన్ని కుటుంబాలు ప్రాణాలు తీసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో వెర్రితలలు వేస్తున్న ఈ సంస్కృతికి అడ్డుకట్టే వేసేదెలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.