Prathidhwani: పాడిపంటల దేశంలో ఆకలి బాధలు ఎందుకు..? - hunger problems in india
పాడిపంటలు, ధాన్యరాశులతో అలరారుతున్నది భారతదేశం. అయినా పేదలు, అభాగ్యుల ఆకలి మంటలు చల్లారడం లేదు. పొలాల్లో రైతులు చెమటోడ్చి పండిస్తున్న ధాన్యం గింజలు గిడ్డంగులకు చేరుతున్నాయి. కానీ అవి పేదల కడుపులు నింపడానికి అక్కరకు రావడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు? పరిష్కారాలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.