Pratidwani: జీఓ 317 మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
రాష్ట్రంలో ఉద్యోగుల పోస్టింగ్‌లు, బదిలీల ప్రక్రియ ప్రహసనంగా తయారైంది. జోనల్, మల్టీజోనల్ వారీగా కేటాయించిన స్థానాల్లో చేరికలు పూర్తైనా.. జిల్లా స్థాయిలో ఉద్యోగుల చేరికలు మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఉద్యోగులు అధిక సంఖ్యలో ప్రాధాన్యతలు ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌లు నిర్ణయించడం సమస్యగా మారింది. భార్య-భర్త, విడో, ఇతర కేటగిరీల్లోనూ ఉద్యోగుల ప్రాధాన్యతలను నిర్ణయించడంలో చిక్కులు ఏర్పడ్డాయి. సీనియారిటీ జాబితాలు, స్థానికత వర్తింపులపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టింగుల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.