తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani: భారత శిక్షాస్మృతిలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందా!

By

Published : Jan 14, 2022, 8:54 PM IST

Pratidwani: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం సమూల ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. నేరాల నమోదు, సాక్ష్యుల విచారణ, శిక్షల ఖరారుకు దిశానిర్దేశం చేస్తున్న చట్టాల్లో కాలం చెల్లిన అంశాలను సంస్కరించేందుకు ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టులు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో భారత శిక్షాస్మృతిలో మార్పులపై గతంలో ఏర్పాటు చేసిన కమిషన్లు ఎలాంటి సిఫారసులు చేశాయి? రణబీర్ సింగ్‌ కమిటీ సంప్రదింపులతో సాధించిన ప్రగతి ఏంటి? బ్రిటిష్‌ కాలంలో రూపొందిన శిక్షాస్మృతికి ఇప్పుడు ఎలాంటి సంస్కరణలు అవసరం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details