pratidwani: ప్రస్తుత క్యాలెండర్ ఎప్పుడు పుట్టింది? - తెలంగాణ వార్తలు
Calendar History: కాలం ఓ అద్భుత మాయాజాలం. క్రమం తప్పకుండా పగలు, రాత్రులను పునరావృతం చేస్తున్న సమయ విభజన సూత్రం. కాలాన్ని రోజులు, నెలలు, సంవత్సరాలుగా తేల్చిన సమయ సూచిక క్యాలెండర్. కాల గతిని ఒడిసిపట్టే కృషిలో రోజుకు ఇరవై నాలుగు గంటల పద్ధతిని ఈజిప్టు, బాబిలోనియా, గ్రీకు నాగరికతలు పాటించాయి. మన దేశంలో రోజును అరవై ఘడియలుగా విభజించారు. ఈ క్రమంలోనే కాలం కొలతల కోసం భారతీయ శాస్త్రవేత్త వరాహమిహిరుని "పంచ సైద్ధాంతిక" ఆవిష్కృతమైంది. జరుగుతున్న ప్రతీ సంఘటనకు సాక్ష్యంగా నిలిచే అద్దం... కాలం. అంధయుగమైనా, స్వర్ణయుగమైనా చరిత్రకు ప్రతిబింబం. అంతటి గొప్ప కాలక్రమణిక ఎలా పుట్టింది? అసలు ఏంటి ఈ కాలం కథ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.