తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని : వ్యవసాయ బిల్లులతో రైతులకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి? - ప్రతిధ్వని ఈరోజు చర్చ సమాచారం

By

Published : Sep 21, 2020, 9:34 PM IST

వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంలో రాజ్యసభ రణరంగాన్ని తలపించింది. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని లేదా సెలక్ట్​ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. ఈ నేపథ్యంలో మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ప్రభుత్వం నెగ్గించుకుంది. వ్యవసాయ బిల్లులను రైతుల పాలిట మరణ శాసనాలుగా కాంగ్రెస్​ విమర్శించింది. రైతుల శ్రేయస్సే ఆ బిల్లుల ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన సంస్కరణలతో రైతులకు సాధికారత లభిస్తుందని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ బిల్లులతో రైతులకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి? వాటి వల్ల రైతులకు కలిగే ఉపయోగాలను ప్రభుత్వం చట్ట సభల్లో ఎందుకు స్పష్టంగా వివరించలేక పోయింది? గందరగోళ పరిస్థితుల్లో ఎందుకు నెగ్గించుకోవాల్సి వచ్చింది? లాంటి అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details