తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: యువత నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకం - prathidwani latest news

By

Published : Jul 17, 2020, 9:36 PM IST

కరోనా సంక్షోభ సమయంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకమని దేశ యువతకు ప్రధాని మోదీ సూచించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పనివిధానంతో పాటు ఉద్యోగ స్వభావాలు మారిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నూతన నైపుణ్యాలను సంతరించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. యువతలోని శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు కేంద్రం ఐదేళ్ల క్రితం స్కిల్​ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022 నాటికి 40 కోట్ల మందిని నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా నేపథ్యంలో స్కిల్​ ఇండియా కార్యక్రమాన్ని ఇంకెంత వేగవంతం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి ? లాంటి అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details