ప్రతిధ్వని: కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఎంత వరకు వచ్చాయి? - ఈనాటి ప్రతిధ్వని చర్చ తాజా సమాచారం
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరో వైపు కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ఆందోళనను పెంచుతోంది. కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ రావచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా విజృంభణ తీరు ఎలా ఉంది? వ్యాక్సిన్ ప్రయోగాలు ఎంత వరకు వచ్చాయి అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.