తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: రామాలయం భూమిపూజ చారిత్రక ఘట్టంపై చర్చ - అయోధ్యలో రామమందిరం భూమి పూజపై చర్చ

By

Published : Aug 5, 2020, 9:24 PM IST

అయోధ్యలో రామమందిరం భూమి పూజ కనుల పండువగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ అమృత ఘడియలను కోట్లాది మంది హిందువులు ఆనంద పారవశ్యంతో వీక్షించారు. భూమి పూజ అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ దేశమంతా రామమయం అయిందని అభివర్ణించారు. కోట్ల మంది మనోసంకల్పానికి ప్రతీక రామమందిరం. పురుషోత్తముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాముని ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు రామ మందిరం మార్గం చూపిస్తోందన్నారు. రాముడి ప్రేరణతో భారత్​ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామాలయం భూమిపూజ చారిత్రక ఘట్టంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details