ప్రతిధ్వని: కరోనాతో ప్రజలు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? - ప్రతిధ్వని ఈరోజు చర్చ
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విస్తరిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. నిత్యం 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. మరో వైపు గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం కళ్లన్ని వ్యాక్సిన్‌పైనే ఉన్నాయి. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి? టీకా వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? అందుకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక అవసరం? అనే అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.