ప్రతిధ్వని: రైతు ఉద్యమానికి పరిష్కారం ఎప్పుడు? ఎలా? - ప్రతిధ్వని చర్చ
కొత్త సాగుచట్టాల రద్దు కోసం మొదలైన రైతు ఉద్యమం దారెటు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఇదే ప్రశ్న. ప్రభుత్వం రైతులతో పలు దఫాలు చర్చలు జరిపినా.. ఇప్పటికీ ఫలితం రాలేదు. అన్నదాతల ఆందోళనలు 70 రోజులు దాటాయి. సుప్రీం కోర్టు జోక్యంతో సాగు చట్టాలను ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామన్న కూడా.. ఈ చట్టాన్ని రద్దు చేస్తేనే గాని పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు రైతులు. ఈ క్రమంలోనే దిల్లీలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు.. రైతులకు మద్దతుగా నిలవడం వంటి ఘటనలతో ఈ ఉద్యమం వాడీవేడిగా సాగుతోంది. ఇవాళ దిల్లీలో రైతుల్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల కూడా ఉద్యమం మరింత ఉద్ధృతం కానుంది. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? ఎలా? అనే దానిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.