ప్రతిధ్వని: పీవీ సంస్కరణలు దేశ దశ- దిశను ఎలా మార్చాయి? - pv narasimharao special debet
తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుభాషా కోవిధుడు, ఆర్థిక సంస్కరణల నిర్దేశకుడు, ఆధునిక భారత రూపశిల్పి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అలాంటి మహోన్నత వ్యక్తికి భారత రత్న ఇచ్చి గౌరవించాలని ఆకాంక్షించింది. సంస్కరణలే శ్వాసగా, ఆధునికతే తన భాషగా జీవించిన పీవీ నరసింహారావు దిల్లీ పీఠమెక్కి దేశ చరిత్రనే శాసించారు. కోట్లాది ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక మాంద్యాలు, సంక్షోభాలు, ప్రపంచాన్ని కుదిపివేసినా భారత్ తట్టుకొని నిలబడిందంటే అందుకు కారణం అక్షరాలా పీవీ దార్శనికతే. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో పీవీ ప్రత్యేకత ఏంటి? ఆయన ఆర్థిక సంస్కరణలు దేశ దశను- దిశను ఎలా మార్చివేశాయి. అరుదైన ఆయన వ్యక్తిత్వం దేశానికిస్తున్న సందేశం ఏంటన్న అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది.
Last Updated : Jun 27, 2020, 10:59 PM IST