తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: కరోనా చీకట్లలో విద్యా వ్యవస్థ...రానున్న మార్పులు ఏంటి?

By

Published : Apr 28, 2021, 9:12 PM IST

అరకొరగా సిలబస్‌, నామమాత్రంగా విద్యాబోధన, సిగ్నల్‌ అందని ఆన్‌లైన్ తరగతులు, ప్రైవేటు ఉపాధ్యాయులకు చాలీచాలనీ వేతనాలు. ఇవన్నీ కరోనా కాలంలో విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణాలు. అనేక అవాంతరాలు, అగచాట్ల మధ్యనే ఒక విద్యా సంవ‌త్సరం ముగిసిపోయింది. చదివీ చదవనట్లు... సాగిన విద్య, వచ్చే ఏడాదికి ఉంటుందో ఉండదో తెలియని పాఠశాలలు, కళాశాలలు... విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా తయారయ్యాయి. విడతల వారీగా తరుముకొస్తున్న కొవిడ్‌ ఉత్పాతాలు విద్యారంగం మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యకు జరిగిన నష్టం ఏంటి? కళాశాల స్థాయిలో విద్యారంగం కోలుకునే వీలుందా? పిల్లలు, యువకుల చదువుకు భరోసా ఏంటనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ..

ABOUT THE AUTHOR

...view details