తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: వ్యాక్సినేషన్‌ సవాళ్లను అధిగమించడం ఎలా? - కరోనా వైరస్ తాజా వార్తలు

By

Published : Apr 26, 2021, 9:25 PM IST

మే 1... దేశంలో 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్‌ కోసం నిర్ణయించిన ముహూర్తం ఇది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉరుముతున్న తరుణంలో టీకా మినహా మార్గం లేదంటోంది శాస్త్ర ప్రపంచం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాట చెబుతోంది. కానీ అనుకున్న లక్ష్యం చేరుకునేదెలా? వ్యాక్సిన్‌ నిల్వలు వేగంగా తరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. డిమాండ్ - ఉత్పత్తి మధ్య లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల 28 నుంచి నమోదు.. మరో 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు దేశ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఉత్పత్తి పరమైన సవాళ్లను అధిగమించడం ఎలా? వంద రోజుల అనుభవాల నుంచి.. అందరికీ వ్యాక్సిన్ దిశగా పంపిణీ పరంగా ఎలాంటి సన్నద్ధత అవసరం? అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details