prathidwani: సత్వర న్యాయ సాధనకు దగ్గరిదారేది..? - సుప్రీంకోర్టు సీజే రమణ
న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న కక్షిదారులకు సత్వర న్యాయం సుదూర స్వప్నం అవుతోంది. దీనికితోడు వకీలు ఫీజులు, కాలహరణం సరేసరి. పేదలు, ధనికుల తేడాలేకుండా, వ్యక్తులు, సంస్థల తారతమ్యం లేకుండా న్యాయ వివాదాల పరిష్కారానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిత్వ విధానమే మంచిదంటున్నారు.. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి. ఈ నేపథ్యంలో సంప్రదింపులు, రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారానికి కోర్టుల వెలుపల ఉన్న వ్యవస్థలు ఏంటి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.