Prathidwani: ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? - Inflation impact on Economy
Inflation impact on Economy: దేశంలో సామాన్యుల పరిస్థితి కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిలా తయారయ్యింది. బియ్యం, కూరగాయలు మొదలుకొని ఎరువులు, వాహనాలు, వస్త్రాల వరకు ఏది కొందామన్నా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కరోనా అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం మన దేశంలోనూ అంతకంతకూ తీవ్రమవుతోంది. ఫలితంగా జనజీవనం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది. ప్రతికూల పరిస్థితుల్లో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్పులతో నెట్టుకొస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యం వహించే పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాలు సంక్షోభంలోకి జారిపోతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే తరుణోపాయం ఏంటి.. ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.