ప్రతిధ్వని: ధరల పెరుగుదల నుంచి సగటు వ్యక్తి బయటపడేదెలా?
అసలే ఆర్థిక మందగమనం... ఆ పై కరోనా కష్టాలు. సామాన్య, మధ్యతరగతి వర్గాల జీవితాల్ని తలకిందులు చేసిన ఈ పరిస్థితుల్లోనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి పెరుగుతున్న ధరలు. వంట గ్యాస్ మంట పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు వంటింటి బడ్జెట్ను అదుపు తప్పేలా చేస్తున్నాయి. ఇంతలోనే గ్యాస్ధరల సమీక్ష వ్యవధిని వారాలు, రోజుల్లోకి మార్చనున్నారనే సంకేతాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సగటు జీవి పరిస్థితి ఏంటి? ధరల దరువు నుంచి వారికి ఉపశమనం ఎలా? అనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.