తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI : సర్కారు బడికి నిర్వహణ కష్టాలు..! - ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల కొరతపై ప్రతిధ్వని చర్చ

By

Published : Nov 17, 2021, 9:08 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ బడుల నిర్వహణ ఖర్చులకు నిధుల్లేక ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. సొంత డబ్బులతో తాగునీరు, పారిశుద్ధ్యం, ఇంటర్నెట్‌, మైనర్‌ మరమ్మతులు చేపడతూ బడి బండిని ముందుకు నడిపిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇంకా అందలేదు. ఈ నిధుల కొరత ప్రభావం విద్యా బోధనపై పడుతుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో పాఠశాలలకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గ్రాంట్‌ విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల ఆలస్యమైతే ఎదురయ్యే ఇబ్బందులేంటి ? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details