ప్రతిధ్వని:నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వైఖరి ఏంటి? - వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన వార్తలు
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతం చేశారు. దేశవ్యాప్తంగా నిరహార దీక్ష చేపట్టారు. రైతుల ఆందోళనకు తెరదించేందుకు కేంద్రం తదుపరి చర్చలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటి వరకు జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కొత్త వ్యవయసాయ చట్టాలు రద్దు చేసేవరకు తమ ఆందోళన ఆగదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అసలు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వైఖరి ఏంటి? రైతుల వాదన ఏ విధంగా ఉంది.