ప్రతిధ్వని: కరోనా వైరస్ వ్యాప్తి గొలుసు తెంచడం ఎలా?
దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. సెకండ్ వేవ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకల్లేని కష్టం ఒకచోట. కనీసం శ్మశానంలో ఖాళీ లేని భయానక, నిస్సహాయ దుస్థితి మరొకచోట. వారం వ్యవధిలో కట్టలు తెంచుకున్న వ్యాప్తితో రోజువారీ కేసులు 3 లక్షల చేరువవుతున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు. అయినా కేసుల ఉద్ధృతి మాత్రం తగ్గే అవకాశాలు కనిపించటం లేదు. మరి ఎలా? అసలు వైరస్ ఈ స్థాయిలో విజృంభించడానికి కారణాలు ఏమిటి? ఇప్పుడా వ్యాప్తి గొలుసు తెంచడం ఎలా? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.