ప్రతిధ్వని: 2030 నాటికి వంద కోట్ల మందిపై పేదరిక ప్రభావం
కరోనా సంక్షోభ ప్రభావం వల్ల 2030 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావం ప్రజల జీవన ప్రమాణాలపై పదేళ్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. సంక్షేమం, పరిపాలన, డిజిటలీకరణ, గ్రీన్ ఎకానమీలో పెట్టుబడులు పేదరిక పెరుగుదలను కొంతవరకు నియంత్రిస్తాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మనదేశంలో పేదరికం సవాళ్లను అధిగమించాలంటే ఏయే రంగాల్లో పెట్టుబడులు పెరగాలి? ముఖ్యంగా ఉపాధికల్పన, నైపుణ్యాలపై ఏ స్థాయిలో దృష్టి సారించాలి? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.