ప్రతిధ్వని: వరదల నేపథ్యంలో నగరాల్లో ప్రణాళికలు ఎలా ఉండాలి? - ప్రతిధ్వని ఈరోజు సమాచారం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు పట్టణాలు, నగరాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, వరంగల్, ఖమ్మం లాంటి నగరాలు కుడా వరద నీటితో సతమతమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల కబ్జా, నలాలా ఆక్రమణతో నగరాలు, పట్టణాలు జలమయం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ప్రణాళికలు ఎలా ఉండాలి? పట్టణాలు, నగరాల్లో ప్రణాళికల లోటు పాట్లు ఏమటి? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.