ప్రతిధ్వని: ఏపీలో పంచాయతీ ఎన్నికలు, సుప్రీం తీర్పుపై ప్రత్యేక చర్చ - supreme verdict on panchayat elections
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. మెుదటి నుంచి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవ్వటం.. ఆ ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం అడ్డుకోవటం... వివిధ రూపాల్లో అభ్యంతరాలు చెప్పటం చూస్తేనే ఉన్నాం. నిన్నటి వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగుతాయా లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు కచ్చితంగా నిర్వాహించాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.