pratidhwani : ఆత్మహత్యల ఊబి నుంచి నిరుద్యోగులను బయటపడేసే మార్గమేది? - ప్రతిధ్వని
దేశంలో నిరుద్యోగ యువత బలవన్మరణాలు పెరిగాయి. అన్ని అర్హతలున్నప్పటికీ ఉద్యోగం రాక... చేతిలో ఉపాధిలేక నిరాశ చెందిన నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏటా లక్షలాది మంది యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే... ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో భర్తీ అవుతున్న కొలువులు అంతంతమాత్రమే. అసలు దేశంలో ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎందుకుంది? మన పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల సామర్థ్యం ఎంత? ఆత్మహత్యల ఊబి నుంచి నిరుద్యోగులను బయటపడేసే మార్గాలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.