prathidhwani: దేశంలో తీవ్రస్థాయికి హ్యాకింగ్ ముప్పు.. సైబర్ భద్రత మిథ్యేనా? - crypto currency
హ్యాకింగ్ ముప్పు తీవ్రం అవుతోంది. సామాన్య నెటిజన్ల సంగతి సరే.. చివరకు.. దేశ ప్రధానమంత్రిని కూడా వదిలి పెట్టలేదు సైబర్ కేడీలు. ఒకవైపు దేశంలో క్రిప్టో కరెన్సీ నియంత్రణకు బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. మరొకవైపు అదే ప్రభుత్వాధినేత ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేశారు. కొద్ది క్షణాల సేపు తమ బిట్‌కాయిన్ కరెన్సీకి ప్రచార వేదికగా చేసుకున్నారు. దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ సామర్థ్యాన్నే సవాల్ చేసింది.. ఈ హ్యాకింగ్ దాడి. ఈ సంఘటనను ఎలా చూడాలి? డిజిటల్ వెల్‌బీయింగ్, సైబర్ సెక్యూరిటీ లిటరసీలో దేశం ఎక్కడ ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.