PRATIDHWANI: ప్రధానమంత్రి ఫసల్ బీమా.. రైతులకేదీ ధీమా.? - PMFBY SCHEME
కేంద్రం పంటల భీమాకు అందిస్తున్న పీఎంఎఫ్‌బీవై పరిహారం రెండేళ్లుగా రాష్ట్ర రైతులకు అందడం లేదు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల బారిన పడి పంట నష్టపోయిన రైతుకు భరోసా కల్పించాల్సిన ఫసల్ బీమా.. రైతుకు ధీమా ఇవ్వడం లేదు. పంటల బీమా పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన ధోరణి అవలంభిస్తున్నాయి. ఫలితంగా రైతులు తమ పంటలకు బీమా ప్రీమియం చెల్లించినా.. పరిహారం కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతన్నకు అండగా నిలవాల్సిన ఫసల్ బీమా పథకం ఎందుకు అలంకార ప్రాయంగా మారింది. ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.