prathidhwani: కొత్త జోన్ల వ్యవస్థకు అవాంతరాలన్నీ తొలగినట్లేనా..? - prathidhwani debate on new zonal systems
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ జోనల్ వ్యవస్థ స్వరూపం మారింది. 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లతో తుది రూపం దాల్చింది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఉద్యోగులు, అధికారులు, నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్న కొత్త జోన్ల వ్యవస్థకు అవాంతరాలన్నీ తొలగిపోయినట్లేనా? కొత్త విధానం అమలులో ఎదురయ్యే చిక్కుముడులన్నీ వీడినట్లేనా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.