అట్టహాసంగా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర - తెలంగాణ వార్తలు
సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో ప్రసిద్ధ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర... ఆదివారం రాత్రి ప్రారంభమైంది. సమీపంలోని కేసారం గ్రామం నుంచి తీసుకువచ్చిన దేవర పెట్టె రాకతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలొచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.