Tirumala: తిరుమలలో ప్రకృతి సోయగాలు..మైమరిచిపోతున్న భక్తులు - శేషాచలం కొండలల్లో ప్రకృతి రమణీయం
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో వాతావరణం సుందరంగా మారింది. ఏడుకొండల అందాలు అన్నీఇన్నీ కావు. కనుమ దారుల్లో కొండలను ముద్దాడుతున్న మంచు తెరలు యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. శేషాచలం అందాలను చూసి ప్రతి ఒక్కరూ మైమరచిపోతున్నారు. తిరుమలకు ఘాట్ రోడ్డులో వెళ్తున్న భక్తులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలను తిలకిస్తూ..స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు.