రాశిఫలం: మిథునం - horoscope
ఆదాయం:2 , వ్యయం:11, రాజపూజ్యం:2, అవమానం:4 ఈ రాశి వారు వివాహ శుభాకార్యాల్లో మీ మాటే నెగ్గించుకుంటారు. ప్రతి విషయంలోనూ.. తొడబుట్టిన వాళ్లు, తల్లిదండ్రులు, హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. కష్టపడి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పని చేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ గట్టి పోటి ఎదుర్కొంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా.. చిన్న చిన్న తగాదాలు చికాకు కలిగిస్తాయి. కంబైన్డ్ స్టడీస్ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్తపడతారు. బంధువుల ఆస్తులకు సంబంధించి.. దాచిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి.. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో కాస్త దిగులు, ఆలోచన ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపుచేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాల్లో విద్యనభ్యసించడానికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి.
Last Updated : Mar 25, 2020, 11:49 AM IST