తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాశిఫలం: మేషం - మేషరాశి ఫలితాలు

By

Published : Mar 25, 2020, 5:39 AM IST

Updated : Mar 25, 2020, 11:48 AM IST

ఆదాయం: 5, వ్యయం: 5, రాజపూజ్యం: 3, అవమానం: 1 మేష రాశి వారు ఈ ఏడాది ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగున్నా.. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గృహ సంబంధమైన వ్యాపారాలు నత్తనడకన సాగినా.. కొన్ని ప్రాజెక్టుల్లో లాభాలుంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో మీ అంతరత్మ సాక్షిగా విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీసులకు సంబంధించి ఈ రాశి వారు బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. పెట్టబడికి వెనుదిరగారు. కొత్తవారిని నియమిస్తారు. అన్నీ విధాలుగా బాగా చూసుకున్నా ..కొంతమంది నసుగుతూనే ఉంటారు. వారి వల్ల ఉపయోగం ఉండదు.. అయినా భరిస్తారు. మీరు ఎంతో రహస్యాంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయి. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్నా ఫైళ్లపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. ఇంట్లో అన్ని పనులు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని ఈ రాశివారు అనరు.. కష్టం, అంకిత భావంతో విజయం సాధిస్తారు.
Last Updated : Mar 25, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details