క్రిస్మస్ వెలుగులు... రంగురంగుల విద్యుత్ కాంతులు - medak church video
క్రిస్మస్ సందర్భంగా మెదక్ కేథడ్రాల్ చర్చి అందంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో... వెలుగులు విరజిమ్మేలా అలంకరించారు. ప్రధానా గేటు నుంచి చర్చి లోపలి వరకు కాంతులీనుతున్న విద్యుత్లైట్ల వరుసలతో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. చర్చిలోపల మెరుపు కాగితాలు, బెలూన్లతో అలంకరించారు. భక్తులకు ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా... పశువుల పాక, ఎత్తైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి... ఈ అలంకారాలతో మరింత ఆహ్లాదంగా, అందంగా మారి... సందర్శకులను ఆకర్షిస్తోంది.