గొలుసు లాగాడని.. గుంజకు కట్టారు! - విశాఖ జిల్లా పెందుర్తిలో చైన్ స్నాచింగ్
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో చైన్ స్నాచర్లు.. బీభత్సం సృష్టించారు. నారపల్లి చిన్నతల్లి అనే వృద్ధురాలు రోడ్డుపై నడిచి వెళ్తుండగా... ఇద్దరు చైన్ స్నాచర్లు వెంబడించారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. వాహనంపై వేగంగా వెళ్లే క్రమంలో ఓ యువకుడు కింద పడిపోగా... స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం సబ్బవరం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.