వైభవంగా మహాశివరాత్రి వేడుకలు - ఈరోజు మహాశివరాత్రి వేడుకలు తాజా వైరల్ వీడియో
ఆంధ్రప్రదేశ్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా శివాలయాలు ముస్తాబయ్యాయి. పరమ శివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలిరావటంతో.. ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పలు శైవ క్షేత్రాల్లో ముక్కంటికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దృశ్య మాలిక మీ కోసం.