YADADRI: పసిడి వర్ణంలో వెలుగులీనుతూ కనువిందు చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రం - yadadri temple latest news
యాదాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక విద్యుదీకరణ పనులు కొనసాగిస్తున్నారు. ఆలయ రాజగోపురాలు, మాఢవీధుల్లో బెంగళూరు సంస్థకు చెందిన నిపుణులతో లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సందర్భంగా సన్నాహాల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో అమర్చిన విద్యుద్దీపాలను సోమవారం రాత్రి ప్రయోగాత్మకంగా వెలిగించారు. గోపురాలకు వెలుతురు వ్యాపించేలా అమర్చిన దీపాల పనితీరును పరిశీలించారు. ఆలయం చుట్టూ చిమ్మచీకట్లు ఉన్న సమయంలో సుదూరం నుంచి స్వామి సన్నిధి విద్యుత్ దగదగల నడుమ పసిడి వర్ణంలో వెలుగులీనుతూ భక్తజనులకు కనువిందు చేసింది.