kuntala water fall: ఉప్పొంగుతున్న కుంటాల.. పోటెత్తుతున్న పర్యాటకులు - కుంటాల జలపాతం పరవళ్లు
రాష్ట్రంలో ఎత్తైయినా జలపాతంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలోని కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కడెం వాగు ఉప్పొంగడంతో జలపాతానికి భారీగా వరద నీరు పోటెత్తింది. రెండు పాయలుగా కనువిందు చేసే జలపాతం ఇపుడు పూర్తిగా నిండి నురగలు కక్కూతూ కిందికి దూకుతోంది. జలపాతం చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతం చిత్రాలను కెమెరాల్లో బంధిస్తున్నారు.