తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇదెక్కడో అనుకునేరు... మన కొండపోచమ్మ సాగరే! చూసొద్దమా మరి! - కొండ పోచమ్మ సాగర్ వీడియో

By

Published : Jan 22, 2022, 6:17 PM IST

పర్యాటకాభివృద్ధిశాఖ కొండపోచమ్మసాగర్ జలాశయంపై రూపొందించిన డాక్యుమెంటరీని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని పర్యాటక ప్రదేశం కొండపోచమ్మ సాగర్​పై టూరిజం ప్రచారం కోసం దూలం సత్యనారాయణ దీన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఉన్న పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణీయమైన ప్రాంతాల ప్రత్యేకతలపై షార్ట్ ఫిల్మ్​లు రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రచార, సమాచార కేంద్రాల ద్వారా పర్యాటకులకు చేరేలా ప్రచారం చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో పర్యాటకులు విదేశాలకు వెళ్లెందుకు ఎన్నో ఆంక్షలు ఉన్నాయని... మన రాష్ట్రంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. దేశీయంగా ఉన్న పర్యాటక ప్రదేశాల వివరాల్ని వీడియోల ద్వారా పర్యాటకులకు చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details